పార్కింగ్ విషయంలో గొడవ.. మాట్లాడుకుందాం అని స్టేషన్కు వచ్చి.. కత్తులు, కట్టెలతో ఇరు వర్గాల రచ్చ

పార్కింగ్ విషయంలో గొడవ.. మాట్లాడుకుందాం అని స్టేషన్కు వచ్చి.. కత్తులు, కట్టెలతో  ఇరు వర్గాల రచ్చ

పార్కింగ్ విషయంలో గొడవ. ఎవరో ఒకరు సర్దుకుపోతే సెట్ట అయ్యేది. కానీ కత్తుల వరకు తీసుకొచ్చారు. పోలీసుల సమక్షంలో మాట్లాడుకుందాం అని వచ్చి.. ఏకంగా స్టేషన్ లోనే కత్తులు, కట్టెలతో రచ్చ రచ్చ చేసిన  ఘటన హైదరాబాద్ కీసరలో శనివారం (సెప్టెంబర్ 04)న చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..  మేడ్చల్ జిల్లా కీసరలో రెండు వర్గాల మధ్య జరిగిన  గొడవ పోలీసులకే చికాకు తెచ్చిపెట్టింది. బుధవారం (అక్టోబర్ 01) సాయంత్రం  ముద్దం బాలయ్య అనే వ్యక్తి ఆటో తీసుకొని యాదవ్ నగర్ కాలనీకి వెళ్లాడు. అదే సమయంలో అక్కడే ఎలక్ట్రికల్ షాప్ కి వచ్చిన అన్న చెల్లెళ్ళకి, ఆటో బాలయ్య మధ్య గొడవ జరిగింది.

ఆటోకి అడ్డంగా ఉన్న బైక్ తీయమని బాలయ్య అడగటంతో గొడవ మొదలైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఒక్కరి పై ఒక్కరు స్థానిక కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

►ALSO READ | విడాకుల సెటిల్ మెంట్లతో దివాళా తీస్తున్న మగాళ్లు : పెళ్లి తర్వాత ఉద్యోగాలు మానేస్తున్న 46 శాతం భార్యలు

శనివారం (అక్టోబర్ 04)  పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందాం అని ఇరు వర్గాలు కీసర పోలీస్ స్టేషన్ కి వచ్చారు. మాట్లాడుకుందా అని చెప్పి వర్గం చాకులు, మరో వర్గం కట్టఎలు తీసుకొని రావడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. 

చర్చల సమయంలో మాటలు శృతి మించి పోలీసుల ముందే ఒకరిపై ఒకరు దాడికి దిగారు. పోలీసులు హెచ్చరించినా రెచ్చిపోయి కత్తులు, కట్టెలతో వీరంగం సృష్టించారు. దీంతో రెండు వర్గాల నుంచి సుమారు 20 మందిపై కేసు నమోదు చేశారు కీసర పోలీసులు. ఇరువర్గాలను తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేయనున్నారు.