అఖండ 2లో డివైన్ ఎనర్జీతో ఫైట్స్ కంపోజ్ చేశాం

అఖండ 2లో డివైన్ ఎనర్జీతో  ఫైట్స్ కంపోజ్ చేశాం

‘అఖండ 2’లో బాలకృష్ణ విశ్వరూపం చూస్తారని,  ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌కి గూస్‌‌‌‌బంప్స్ రావడం ఖాయమని ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ అన్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి  ఫైట్స్ కంపోజ్ చేసిన రామ్ లక్ష్మణ్  మాట్లాడుతూ ‘‘అఖండ’కి మించిన స్పాన్, కాన్వాస్  ఈ సినిమాలో ఉన్నాయి.  ఫైట్స్ విషయంలో మేం  చాలా హోం వర్క్ చేశాం.  ప్రేక్షకులు వంద శాతం అంచనాలు పెట్టుకుంటే వెయ్యి శాతం ఆ అంచనాలను అందుకునేలా ఉంటుంది. 

ఓంకార శక్తి, శివశక్తిని గుండెల్లో నింపుకుంటే  జీవితం ఎంత ఆనందంగా, అద్భుతంగా ఉంటుందనేది  బోయపాటి గారు అద్భుతంగా చూపించారు. బాలయ్య బాబుతో మేము ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నాం ఈ చిత్రానికి మాత్రం ఒక డివైన్ ఎనర్జీతో ఫైట్స్ కంపోజ్ చేశాం.  మామూలుగా గన్‌‌‌‌కే  పవర్ ఉంటుంది. ఆ గన్‌‌‌‌కి  ఒక త్రిశూలం పవర్, శివుని శక్తి తోడైతే ఎలా ఉంటుందో ఆ పవర్‌‌‌‌‌‌‌‌తో  యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌ని కంపోజ్ చేశాం. ఇందులో బాలయ్య పాత్రలో లీనమై నటించారు.  కుంభమేళాలో చిత్రీకరించిన సీన్స్ మాకు మొమరబుల్. ఈ సినిమా కోసం కొన్ని టన్నుల విభూథి వాడాం. థియేటర్‌‌‌‌‌‌‌‌లోని ఆడియెన్స్ మంచి వైబ్రేషన్‌‌‌‌తో  శివ తత్వాన్ని మనసంతా నింపుకునేలా ఉంటుంది’ అని చెప్పారు.