పోరాట యోధులను గుర్తు చేసుకోవాలి

పోరాట యోధులను గుర్తు చేసుకోవాలి

ఇతీయాస్ సంకలన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హైదరాబాద్ సాలర్జింగ్ మ్యూజియంలో నేషనల్ సెమినార్ నిర్వహించారు. ఈ రోజు నుండి రెండు రోజుల పాటు ఈసెమినార్ జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. 1857 నుండి 1948 వరకు స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుల త్యాగాలను వక్తలు గుర్తు చేసుకున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆజాదీకా అమృత్ అమృత్ మహోత్సవలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. సాలర్జింగ్ మ్యూజియం తెలంగాణ పోరాటానికి అద్దం పడుతుందని చెప్పారు. కానీ, ఇక్కడ తెలంగాణలో జరిగిన పోరాట స్మృతులు లేవని, దురదృష్టవశాత్తు తెలంగాణ చరిత్రను వక్రీకరించి చెబుతున్నారని అన్నారు. 
సాలర్జింగ్ మ్యూజియంలో తెలంగాణ స్వతంత్ర పోరాట చిహ్నాలు పెట్టాలని కిషన్ రెడ్డి కోరారు. కావాలని వారిని మరుగున పడే విధంగా చేశారని, వారిని బయటకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. దూరదర్శన్ ద్వారా వరుస కథనాలు ప్రసారం చేస్తామన్నారు. తెలంగాణలో పోరాట యోధులైన కొమురం భీం, రాం జీ గోండు మ్యూజియాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇందుకోసం కోటి రూపాయలు విడుదల చేశామని, అయితే..తెలంగాణ ప్రభుత్వం మాత్రం  భూమి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదే విషయంపై తాను మరోసారి లేఖ రాస్తానని చెప్పారు. పోరాట యోధుల చరిత్రను భద్రపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి కేటాయించడంతో రూ.6 కోట్లు విడుదల చేశామని, దానికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

మద్యం తాగిన టీచ‌ర్ క్లాస్ రూమ్ లో ఏం చేశాడంటే..

ప్రోటోకాల్ వివాదంపై సీఎస్ కు రఘునందన్ రావు ఫిర్యాదు