
జనగామ: ఫుల్లుగా మద్యం తాగి స్కూలుకి వచ్చిన ఓ ఉపాధ్యాయుడు... విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన శుక్రవారం జనగామ మండలం ఎర్రగొల్ల పహాడ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. కరుణాకర్ రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. అంతటితో ఆగక మద్యం మత్తులో విద్యార్థినులపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థినులు ఏడ్చుకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో గ్రామస్థులు సీరియస్ గా స్కూల్ దగ్గరకు వెళ్లారు. అప్పటికే తాగుబోతు ఉపాధ్యాయుడు వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు.
మరిన్ని వార్తల కోసం...