త్వరలోనే డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ : ఎంపీ మల్లు రవి

త్వరలోనే డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ : ఎంపీ మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను త్వరలోనే డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. హైదరాబాద్​లో బ్యాక్​వర్డ్​ క్లాసెస్​ టీచర్స్​ అసోసియేషన్​(బీసీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు ఆధ్వర్యంలో కొత్తగా ఎంపీగా ఎన్నికైన మల్లురవిని సన్మానించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ...రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితోఉందని చెప్పారు. బడుల్లో చదివే బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి మంచి భవిష్యత్ ఇచ్చేందుకు సర్కారు కృషి చేస్తుందని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సర్కారుకు మంచి పేరు తేవాలని కోరారు. బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు మాట్లాడుతూ... సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇచ్చేందుకు తామంతా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాములు, రాష్ట్ర  నేతలు వెంకటయ్య, రాఘవేందర్, తిరుపతయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.