
సినీ నటుడు మంచు మనోజ్ (manchu Manoj) భూమా మౌనిక (Mounika) వివాహబంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి మనోజ్, మౌనిక వివాహం ఘనంగా జరిగింది. ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్, మౌనిక ఒక్కటయ్యారు. వేద మంత్రాల సాక్షిగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం ఉదయమే ‘పెళ్లికూతురు భూమా మౌనిక’ అంటూ ఆమె ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు మనోజ్.
మంచు మనోజ్ ను పెళ్లి కొడుకుని చేస్తున్నప్పటి ఫొటోని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తెనే మౌనిక.