తిరుమల వెంకన్నను దర్శించుకున్న కాజల్

 తిరుమల వెంకన్నను దర్శించుకున్న కాజల్

తిరుపతి: తిరుమల శ్రీవారిని సినీ నటి కాజల్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో ఫ్యామిలీతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు వేద ఆశీర్వచనం అందించగా... అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
ఆలయం వెలుపల కాజల్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ  శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన భర్తతో కలిసి మొదటి సారి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని కాజల్ చెప్పారు.