నేషనల్‌ అవార్డ్స్‌పై సినీ, రాజకీయ ప్రముఖుల హర్షం..

నేషనల్‌ అవార్డ్స్‌పై సినీ, రాజకీయ ప్రముఖుల హర్షం..

జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటనపై సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా ద్వారా విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం (ఆగస్టు 24న) సాయంత్రం ప్రకటించింది. 2021 సంవత్సరానికిగాను పుష్ప: ది రైజ్‌ మూవీలోని నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్‌ సొంతం చేసుకున్నారు. ఉప్పెన మూవీ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ పలు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.

ఉత్తమ నటుడిగా జాతీయ చలన చిత్ర అవార్డు అందుకోనున్న అల్లు అర్జున్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు 69వ జాతీయ అవార్డులు ఒక బొనాంజా అని పేర్కొన్నారు. 

జాతీయ అవార్డులకు ఎంపికైన వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలుగు సినిమా గర్వపడే క్షణమిది. నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డుకు ఎంపికైన బన్నీని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది

- చిరంజీవి 

 

69వ జాతీయ చలనచిత్ర అవార్డులను పొందిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నందమూరి బాలకృష్ణ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 

- బాలకృష్ణ

తెలుగు చిత్రాలకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉంది. అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడు అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి అభినందనలు

- పవన్‌ కల్యాణ్‌

‘ఇదొక సిక్సర్‌. నేషనల్‌ అవార్డ్స్‌కు ఎంపికైన సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి కంగ్రాట్స్‌. జ్యూరీకి థ్యాంక్స్‌ 

-రాజమౌళి

కంగ్రాట్స్‌ అల్లు అర్జున్‌ బావ. ‘పుష్ప’ సినిమాకు పొందే అవార్డులకు నువ్వు అర్హుడువి. 

 

- ఎన్టీఆర్‌ 

కంగ్రాట్స్‌ డియర్‌ అల్లు అర్జున్‌. జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించారు

- సూర్య

ప్రజాదరణ పొందిన పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలకు అవార్డుల పంట పండింది. అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌కి కంగ్రాట్స్‌

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో అనేక అవార్డులను సాధించి తెలుగు చలన చిత్ర రంగానికి విశిష్ట గుర్తింపును తెచ్చిన విజేతలందరికీ శుభాభినందనలు. ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు. పలు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘ఉప్పెన’, ‘కొండపొలం’ చిత్రాల దర్శక, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు... ఉత్తమ విమర్శకుడుగా ఎంపికైన పురుషోత్తమాచార్యులుకు అభినందనలు. 

-  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు