ఉప్పల్ లో ఉరివేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

ఉప్పల్ లో ఉరివేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్ లో కానిస్టేబుల్​ ఆత్మహత్య కలకలం రేపుతోంది. శనివారం(నవంబర్8) ఉప్పల్​పరిధిలోని మల్లాకార్జున నగర్​కు చెందిన శ్రీకాంత్ అనే కానిస్టేబుల్​ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీకాంత్​ 2009 బ్యాచ్​ కి చెందిన కానిస్టేబుల్​.. ప్రస్తుతతం ఫిలింనగర  పోలీస్​ స్టేషన్​ లో విధులునిర్వహిస్తున్నాడు. 

శనివారం ఉదయం 100 కాల్​ ద్వారా సమాచారం అందుకున్న  ఉప్పల్​ పోలీసులు మల్లికార్జున నగర్​ లోని శ్రీకాంత్​ నివాసానికి వెళ్లగా.. శ్రీకాంత్​ ఉరివేసుకొని విగతజీవిగా ఉన్నాడు. 
గత అక్టోబర్ 23 నుంచి శ్రీకాంత్​ విధులకు హాజరు కావడంలేదని తోటి పోలీసులు  చెబుతున్నారు.  విధులకు హాజరు కావడం లేదని శనివారం ఉదయం నోటీసు కూడా పంపినట్టు తెలుస్తోంది. 

శ్రీకాంత్​ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్థిక కారణాలు, ఇంకా ఏమైనా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు.