
- రూ. 50 వేలు ఆర్థికసాయం అందజేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దండ భాస్కర్(51) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. శనివారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ చిలుకూరి బాలు, రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, తలకొప్పుల సైదులు, గంధం రామకృష్ణ, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డివిజన్ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి నర్సయ్య, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, ఈదులగూడ వద్దకు చేరుకొని భాస్కర్ పార్ధీవ దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భాస్కర్ కుటుంబానికి రూ. 50 వేలు తక్షణసాయంగా అందజేశారు. వారి పిల్లల భవిష్యత్తుకు తాను అండగా ఉంటానని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు శ్రీధర్ రూ. 10 వేలు, చింత రెడ్డి శ్రీనివాసరెడ్డి రూ. 10 వేలు, మరో ఇద్దరు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. మిర్యాలగూడ, నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టు మిత్రులు, ప్రజా సంఘాల నేతలు ఈదులగూడ నుంచి మున్సిపాలిటీ ఆఫీస్, టాకా రోడ్డు మీదుగా అంతిమయాత్రలో పాల్గొన్నారు.