గుజరాత్ లో ముగిసిన చివరిదశ ఎన్నికల ప్రచారం

గుజరాత్ లో ముగిసిన చివరిదశ ఎన్నికల ప్రచారం

గుజరాత్ లో చివరిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం చేశాయి. ఈనెల 5న ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికల్లో మొత్తం 2 కోట్ల 51 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర బలగాలను మోహరించారు. 14 జిల్లాల్లో 14 వేల 975 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు గుజరాత్ సీఈవో పి.భారతి తెలిపారు. తొలిదశ పోలింగ్ లో పట్టణప్రాంతాల్లో తక్కువ ఓటింగ్ నమోదైందని.. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.