ఏపీ అసెంబ్లీలో సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లు

ఏపీ అసెంబ్లీలో సీఆర్డీఏ  రద్దు ఉపసంహరణ బిల్లు

ఏపీ రాజధానిపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది  ప్రభుత్వం.  సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ  బిల్లును ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. గతంలో మూడు రాజధానుల బిల్లు కోసం సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసింది ప్రభుత్వం.  ఏపీ పాలన వికేంద్రీకరణ, సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. తక్షణమే సీఆర్డీఏ చట్టం 2014 అమల్లోకి వస్తున్నట్లు  తెలిపారు. చట్టం రద్దుకు కారణాలు చెప్పింది ప్రభుత్వం. 1)భాగస్వాములతో పూర్తి స్థాయి సంప్రదింపులు జరపకపోవడం.2)శాసనమండలిలో బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లడం.  ఈ కారణాలతో చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పింది ప్రభుత్వం.

మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో  రద్దు బిల్లుపై అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని శిమరామ కృష్ణన్ కమిటీ సూచించిందన్నారు. అమరావతి ప్రాంతం సారవంతమైన, ఖరీదైన భూమి అని.. దాన్ని వృథా చేయవద్దని కమిటీ చెప్పిందన్నారు. అనుభవాలు ,చారిత్రక ఆధారాలతోనే వికేంద్రీకరణ చేశామన్నారు.శివరామకృష్ణ కమిటీ నివేదికను అసెంబ్లీలో టేబుల్ చేయకుండానే నిర్ణయం తీసుకున్నారన్నారు. అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి అన్నదే తమ అభిప్రాయమన్నారు.

బీహెచ్ఈఎల్ లాంటి పెద్ద సంస్థలు వస్తే ప్రవేట్ సంస్థలు వస్తాయన్నారు. ఏ రాష్ట్రాలైనా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చాయన్నారు. ఒకే చోటే అన్ని సంస్థలు పెడితే ఏ ప్రాంతము అభివృద్ధి చెందదన్నారు.ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్రమే హైదరాబాద్ లో సంస్థలు పెట్టిందన్నారు. అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి అన్నదే తమ అభిప్రాయమన్నారు.