చాలా దేశాల కంటే మనమే బెటర్

చాలా దేశాల కంటే  మనమే బెటర్

న్యూఢిల్లీ:  దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చే చాన్సే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. కరోనా విపత్తు, సెకండ్ వేవ్, ఒమిక్రాన్, రష్యా--– ఉక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా దేశంలో ద్రవ్యోల్బణం 7% కంటే తక్కువే ఉందన్నారు. సోమవారం లోక్ సభలో ధరల పెరుగుదలపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడారు. దేశంలో కన్జ్యూమర్ డిమాండ్​లో స్తబ్దత గానీ, అత్యధిక నిరుద్యోగం గానీ లేవన్నారు. చాలా దేశాల కంటే మన పరిస్థితి బాగా ఉందని నిర్మల అన్నారు. అమెరికా జీడీపీ ఫస్ట్ క్వార్టర్ లో 1.9% పడిపోతే.. సెకండ్ క్వార్టర్ లో 0.7% పడిపోయిందని చెప్పారు. మన దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రశ్నే లేదన్నారు. ఇదే విషయం బ్లూమ్ బర్గ్ ఎకనమిస్టుల సర్వేలో తేలిందన్నారు. 

‘యూపీఏ’లో రెండంకెలు దాటింది..  

‘‘ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7% వద్ద ఉంది. కానీ యూపీఏ సర్కార్ హయాంలో 2004 నుంచి 2014 మధ్య ద్రవ్యోల్బణం రెండంకెలు దాటింది. అప్పట్లో వరుసగా 22 నెలలపాటు ద్రవ్యోల్బణం 9%పైనే నమోదైంది. ప్రస్తుతం అత్యధిక ద్రవ్యోల్బణం ఆహారం, ఇంధనంలోనే ఉంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ఇన్ ఫ్లేషన్ తగ్గుతూ వస్తోంది. మన దేశంలోనూ అది తగ్గుతుంది” అని నిర్మల చెప్పారు. కమర్షియల్ బ్యాంకుల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్(ఎన్పీఏ) ఆరేళ్లలోనే తక్కువగా నమోదైందని, జీఎస్టీ వసూళ్లు గత 5 నెలలుగా రూ. 1.4 లక్షల కోట్లపైనే వస్తున్నాయన్నారు. 

‘వెపన్స్’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం 

మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్​కు నిధులను నిషేధించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. విదేశాం గ మంత్రి ఎస్.జైశంకర్ ప్రవేశపెట్టిన సామూహిక విధ్వంసక ఆయుధాలు, వాటి పంపిణీ వ్యవస్థల సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.

కేంద్రంపై ప్రతిపక్షాల ఫైర్  

పార్లమెంట్ లో ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని, ఆర్థిక మంత్రి వివరణ ఇవ్వా లంటూ ప్రతిపక్ష సభ్యులు పది రోజులుగా ఆందోళనలు చేశారు. అయితే, ఆర్థిక మంత్రి నిర్మల కరోనా నుంచి కోలుకోవడం తో సోమవారం లోక్​సభలో ఈ అంశంపై చర్చకు అడ్డంకులు తొలిగాయి. కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ చర్చను ప్రారంభిం చారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. జీఎస్టీ పెంపుతో కేంద్ర బడ్జెట్ పెరిగిందని, కానీ 25 కోట్ల ఇండియన్ల బడ్జెట్ మాత్రం పడిపోయిందన్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కల్పించుకుంటూ.. 2013లో ఎల్పీజీ ధర రూ. 1000 దాటింద ని, ఇప్పుడే ధర తక్కువగా ఉందన్నారు. చర్చలో వివిధ పార్టీల నుంచి 20 మంది సభ్యులు పాల్గొన్నారు. కేంద్రం తీరుపై ప్రతిపక్షాల సభ్యులు మండిపడ్డారు. ఎల్పీజీ ధరలు పెరుగుదలతో సామాన్యులు పచ్చి కూరగాయలు తినాలా? అంటూ టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్ సభలో పచ్చి వంకాయ ను కొరికి తింటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. మరోవైపు, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్​ సమాధానంతో తాము సంతృప్తి చెందలేదంటూ కాంగ్రెస్ సభ్యులు మధ్యలోనే వాకౌట్ చేశారు.