వరల్డ్ కప్ : ఫించ్ బ్రిలియంట్ సెంచరీ

వరల్డ్ కప్ : ఫించ్ బ్రిలియంట్ సెంచరీ

లార్డ్స్ : వరల్డ్ కప్-2019లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో దూకుడుగా ఆడుతుంది ఆస్ట్రేలియా. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసిస్ కు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు వార్నర్, ఫించ్ ఆచితూచి ఆడి ఫస్ట్ వికెట్ కు 123 భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత వార్నర్( 53 -హాఫ్ సెంచరీ ) ఔట్ అయినప్పటికీ ఫించ్ దూకుడు తగ్గలేదు. ఈ క్రమంలోనే ఫించ్ సెంచరీ చేశాడు. 11 ఫోర్లు, 2 సిక్స్ లతో సెంచరీ చేసిన ఫించ్..  ఆ తర్వాతి బాల్ తో హిట్టింగ్ పెంచుదామనుకుని ఔట్ అయ్యాడు.

38 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా 212 రన్స్ చేసింది. మాక్స్ వెల్(12), స్టీవెన్ స్మిత్ (19) రన్స్ తో క్రీజులో ఉన్నారు. ఇదే రన్ రేట్ కంటిన్యూ అయితే ఆస్ట్రేలియా స్కోర్ 350 దాటేలా కనిపిస్తుది.