
మేజర్ లీగ్ క్రికెట్ లో న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ అత్యుత్తమ ఫామ్ తో చెలరేగుతున్నాడు. భారీ ఇన్నింగ్స్ లు ఆడుతూ ఈ టోర్నీలో సూపర్ ఐకాన్ గా నిలిచిన ఈ కివీస్ స్టార్.. ఒక సిక్సర్ తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. లాంగ్ డిస్టెన్స్ సిక్సర్లు ఎవరైనా కొట్టగలరు. కానీ అలెన్ మాత్రం హైట్ సిక్సర్ కొట్టి ప్రేక్షకులకు ఫుల్ పైకి ఇచ్చాడు. మేజర్ లీగ్ క్రికెట్ లో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జట్టుకు ఆడుతున్న అలెన్ సియాటిల్ ఓర్కాస్ బౌలర్ అయాన్ దేశాయ్ బౌలింగ్ లో 302 అడుగుల భారీ సిక్సర్ కొట్టాడు.
ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో అయాన్ దేశాయ్.. ఫుల్ లెంగ్త్ డెలివరీని వేశాడు. క్లీన్ ఫుట్‌వర్క్ తో పాటు పర్ఫెక్ట్ టైమింగ్‌తో కొట్టిన ఈ బంతి ఏకంగా ఏకంగా 302 అడుగుల ఎత్తులో సిక్సర్ వెళ్ళింది. డిస్టెన్స్ పరంగా 92 మీటర్ల దూరంలో సిక్సర్ పడింది. ఇక ఈ మ్యాచ్ లో 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసి యాన్ దేశాయ్ లోనే ఔటయ్యాడు. ఈ సీజన్ లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో.. అలెన్ కేవలం 51 బంతుల్లో 151 పరుగులు చేసి ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. ఈ కివీస్ క్రికెటర్ స్ట్రైక్ రేట్ 296 ఉండడం విశేషం. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్లను ఊచ కొత్త కోస్తూ ఏకంగా 19 సిక్సర్లు కొట్టడం సంచలనంగా మారింది.
►ALSO READ | IND VS ENG 2025: రెండో సెషన్ టీమిండియాదే: జైశ్వాల్ సెంచరీ మిస్.. నిలకడగా గిల్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సంజయ్ కృష్ణమూర్తి (41) మరియు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (35) రాణించారు. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, సియాటిల్ ఓర్కాస్ 56 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వెస్టిండీస్ స్టార్ షిమ్రాన్ హెట్మైర్ 37 బంతుల్లో 4 బౌండరీలు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు.