IND VS ENG 2025: రెండో సెషన్ టీమిండియాదే: జైశ్వాల్ సెంచరీ మిస్.. నిలకడగా గిల్

IND VS ENG 2025: రెండో సెషన్ టీమిండియాదే: జైశ్వాల్ సెంచరీ మిస్.. నిలకడగా గిల్

ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో రెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. తొలి సెషన్ లో రెండు వికెట్లు కోల్పోయిన గిల్ సేన.. రెండో సెషన్ లో కీలకమైన జైశ్వాల్ వికెట్ పోగొట్టుకుంది. తొలి రోజు టీ విరామ సమయానికి తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ గిల్ (42), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (14) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, కార్స్, స్టోక్స్ తలో వికెట్ తీసుకున్నారు. 

2 వికెట్ల నష్టానికి 98 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియా.. ఈ సెషన్ లో మరో 84 పరుగులు రాబట్టింది. జైశ్వాల్, గిల్ జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డు ను ముందుకు తీసుకెళ్లారు. గిల్ ఎక్కువగా స్ట్రైక్ తీసుకుంటూ పూర్తి డిఫెన్స్ ఆడాడు. చెత్త బంతులను మాత్రమే బౌండరీకి తరలించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడీని స్టోక్స్ విడగొట్టాడు. 45 ఓవర్ తొలి బంతికి స్టోక్స్ విసిరిన బాల్  ను కట్ చేయబోయి జైశ్వాల్ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 65 పరుగుల భాగస్వామ్యం తర్వాత టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 

►ALSO READ | ZIM vs SA: మూడు టెస్టులకు ముగ్గురు కెప్టెన్లు.. వరల్డ్ ఛాంపియన్స్‌కు ఏంటి ఈ దుస్థితి

87 పరుగుల వద్ద ఔటైన ఈ టీమిండియా యువ ఓపెనర్.. సెంచరీ మిస్ చేసుకున్నాడు. తొలి టెస్టులో సెంచరీ చేసి ఆకట్టుకున్న జైశ్వాల్  రెండో టెస్టులో 100 పరుగుల మార్క్ కోల్పోయి నిరాశగా పెవిలియన్ కు చేరాడు. అంతకముందు తొలి సెషన్ లో 26 బంతుల్లో 2 పరుగులు చేసిన రాహుల్ వోక్స్ ఇన్ స్వింగ్ కు క్లీన్ బౌల్డయ్యాడు.31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కరుణ్ నాయర్.. కార్స్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.