
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన తర్వాత సౌతాఫ్రికా జట్టుకు వింత అనుభవం ఎదురైంది. సఫారీ జట్టుకు వరుసగా కెప్టెన్లు గాయాల పాలవుతున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా గాయపడ్డాడు. దీంతో జింబాబ్వే సిరీస్ కు బవుమా లేకుండానే సౌతాఫ్రికా సిరీస్ కు సిద్ధమైంది. రెండు మ్యాచ్య్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో బవుమా స్థానంలో సీనియర్ ప్లేయర్ కేశవ్ మహారాజ్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. అయితే తొలి టెస్ట్ లో మహరాజ్ సైతం గాయపడి రెండో టెస్టుకు దూరమయ్యాడు.
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎడమ గజ్జ నొప్పితో బాధపడిన ఈ వెటరన్ స్పిన్నర్ గాయపడ్డాడు. తొలి టెస్టు విజయంలో మహారాజ్ కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాటు కీలకమైం హాఫ్ సెంచరీ చేశాడు. రెండో టెస్టుకు మహరాజ్ అందుబాటులో లేకపోవడంతో ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ కు జింబాబ్వేతో జరగబోయే రెండో టెస్టుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో మూడు టెస్టులకు ముగ్గురు కెప్టెన్లు సౌతాఫ్రికా టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ చేయనున్నారు.
►ALSO READ | IND VS ENG 2025: నిన్న అలా.. నేడు ఇలా: మాట మార్చి కుల్దీప్‌కు అన్యాయం చేసిన గిల్
టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో బవుమా.. జింబాబ్వేతో తొలి టెస్టుకు మహరాజ్ జట్టును నడిపించగా.. రెండో టెస్టుకు ముల్డర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. మహారాజ్ దూరం కావడంతో దక్షిణాఫ్రికా జట్టు సెనురాన్ ముత్తుసామిని స్పిన్నర్‌గా ఎంపిక చేసింది. జూలై 6న బులవాయోలో రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. తొలి టెస్టులో సౌతాఫ్రికా జింబాబ్వేపై 328 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఈ మ్యాచ్ లు భాగం కాకపోవడంతో సఫారీలు తమ యంగ్ ప్లేయర్లను టెస్ట్ చేస్తుంది.