IND VS ENG 2025: నిన్న అలా.. నేడు ఇలా: మాట మార్చి కుల్దీప్‌కు అన్యాయం చేసిన గిల్

IND VS ENG 2025: నిన్న అలా.. నేడు ఇలా: మాట మార్చి కుల్దీప్‌కు అన్యాయం చేసిన గిల్

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ భారత జట్టును నడిపించడంలో కాస్త తడబడుతున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో గిల్ తన కెప్టెన్సీతో పర్వాలేదనిపించినా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాడు. లీడ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు గెలిచే మ్యాచ్ లో ఓడిపోయింది. దీంతో రెండో టెస్టు ఎలాగైనా గెలవాలనే ఒత్తిడి గిల్ పై ఉంది. ఇందులో భాగంగా తొలి టెస్టులో విఫలమైన ఆటగాళ్లను పక్కన పెట్టి వారి స్థానాల్లో కొత్త ప్లేయర్లను తీసుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఇంగ్లాండ్ తో రెండో టెస్టుకు ముందు గిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

రెండో టెస్టుకు ఒక రోజు ముందు బౌలింగ్ లో 20 వికెట్లు తీయడమే లక్ష్యమని.. ఆ దిశగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చాడు. అదనపు బ్యాటర్ కంటే బౌలర్లకే తమ ప్రాధాన్యత ఉంటుందని గిల్ తెలిపాడు. నేడు (జూలై 2) ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కు ముందు ఈ టీమిండియా టెస్ట్ కెప్టెన్ మాట మార్చేశాడు. "ఈ మ్యాచ్ లో కుల్దీప్ తీసుకోవాలనుకున్నాం. కానీ చివరి మ్యాచ్ ను దృష్టిలో పెట్టుకుని అదనపు బ్యాటర్ ను జట్టులోకి తీసుకోక తప్పలేదు". అని టాస్ తర్వాత చెప్పుకొచ్చాడు. నిన్న బౌలింగ్ కు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పిన గిల్.. నేడు కుల్దీప్ బదులు అదనపు బ్యాటర్ ను తీసుకోవడం ఆశ్చర్యపరించింది. 

►ALSO READ | IND VS ENG 2025: వారం రోజులు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టారు.. టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్

బుధవారం (జూలై 2) ఎడ్జ్ బాస్టన్ లో ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ తుది జట్టులో స్థానం సంపాదించారు. బుమ్రాకు రెస్ట్ ఇవ్వగా.. శార్దూల్ ఠాకూర్, సాయి సుదర్శన్ లను పక్కన పెట్టింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే..  తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. క్రీజ్ లో జైశ్వాల్ (62), కెప్టెన్ శుభమాన్ గిల్(1) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, కార్స్ తలో వికెట్ తీసుకున్నారు.