
ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు అనుకున్నట్టుగానే తుది జట్టులో స్థానం దక్కలేదు. ముందు నుంచి అనుకున్న ప్రకారం వర్క్ లోడ్ కారణంగా బుమ్రాకు రెండో రెస్ట్ లో రెస్ట్ ఇచ్చారు. బుమ్రా స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ కు స్థానం దక్కింది. పని భారం కారణంగా సిరీస్‌కు ముందే బుమ్రా సిరీస్‌లోని ఏవైనా మూడు మ్యాచులు మాత్రమే ఆడుతాడని.. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో అతడి సేవలు కోల్పోతామని గిల్ రెండో టెస్టుకు ముందు క్లారిటీ ఇచ్చాడు.
మ్యాచ్ కు ముందు వరకు రెండో టెస్టులో బుమ్రా ఆడతాడా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. టాస్ తర్వాత గిల్ మాట్లాడుతూ బుమ్రాకు రెస్ట్ ఇచ్చాము అని చెప్పడంతో ఈ స్టార్ పేసర్ లేకుండానే భారత జట్టు రెండో టెస్ట్ ఆడుతుంది. బుమ్రా రెండో టెస్టులో లేకపోవడంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన అసంతృప్తి వ్యక్తం చేసాడు. రెండో టెస్టుకు బుమ్రాను తీసుకోవాల్సిందిగా చెప్పుకొచ్చాడు. "వరల్డ్ బెస్ట్ టెస్ట్ బౌలర్ కు వారం రోజులు రెస్ట్ ఇచ్చి రెండో టెస్ట్ ఆడకుండా చేశారు. బుమ్రా జట్టులో లేకపోవడం నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. టీమిండియా చేసిన ఈ పని నన్ను నిరాశకు గురి చేసింది". అని శాస్త్రి అన్నాడు.
లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఆడాడు. ఈ మ్యాచులో ఈ పేసర్ చెలరేగి తొలి ఇన్నింగ్స్ లో ఐదు పడగొట్టిన టీమిండియాకు ఓటమి తప్పలేదు. రెండో టెస్టులో టీమిండియా ఖచ్చితంగా గెలవాల్సిన టెస్టులో బుమ్రా ఆడతాడని ప్రచారం జరిగినా అతనికి రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఐదు మ్యాచుల సిరీసులో తొలి టెస్ట్ ఆడిన బుమ్రా.. మిలిగిన నాలుగింట్లో ఏవైనా రెండు టెస్టుల మాత్రమే ఆడనున్నాడు. 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మూడో టెస్ట్ ఐకానిక్ లార్డ్స్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో బుమ్రా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
►ALSO READ | IND VS ENG 2025: జైశ్వాల్ హాఫ్ సెంచరీ.. తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. క్రీజ్ లో జైశ్వాల్ (62), కెప్టెన్ శుభమాన్ గిల్(1) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, కార్స్ తలో వికెట్ తీసుకున్నారు. జైశ్వాల్ హాఫ్ సెంచరీతో రాణించగా.. కరుణ్ నాయర్ 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. రాహుల్ కేవలం 2 పరుగులే చేసి నిరాశపరిచాడు.
Ravi Shastri questions the decision to rest Jasprit Bumrah for the Edgbaston Test. pic.twitter.com/aTmEnMee2d
— CricTracker (@Cricketracker) July 2, 2025