
హైదరాబాద్, వెలుగు: ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ నికరలాభం ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో 67 శాతం పెరిగి రూ.32 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.19 కోట్ల నికర లాభాన్ని సాధించిందని జాగిల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ నిర్వహణ ఆదాయం 50 శాతం పెరిగి రూ.411 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.273 కోట్లుగా ఉంది. ఈసారి టాప్‌లైన్ వృద్ధి 35 శాతం– 40 శాతం మధ్య ఉంటుందని భావిస్తున్నామని జాగిల్ తెలిపింది.