గజేంద్ర షెకావత్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు

గజేంద్ర షెకావత్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ పై రాజస్థాన్ లో కేసు నమోదైంది.  ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్‌ను 10 తలల రావణుడని విమర్శించారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జడావత్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిత్తోర్‌గఢ్‌లోని సదర్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతి లోని 143, 153-A, 295A, 500, 504, 505 , 511 సెక్షన్‌ల కింద గజేంద్ర షెకావత్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. 

చిత్తోర్‌గఢ్‌లో జరిగిన జన్ ఆక్రోష్ ర్యాలీలో గజేంద్ర షెకావత్ మాట్లాడుతూ..  రావణుడికి 10 తలలు ఎలా ఉన్నాయో..  అదే విధంగా ఈ రాజస్థాన్ ప్రభుత్వానికి కూడా  10 తలలు ఉన్నాయని విమర్శించారు.  గెహ్లాట్‌ ప్రభుత్వం అవినీతిలో అగ్రగామిగా ఉందని,  మాఫియాను పెంచి పోషిస్తుందని ఆరోపించారు.  ఈ రావణుడిని అంతం చేసి రాజస్థాన్‌లో  రామరాజ్యం స్థాపించాలని షెకావత్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో  రాజస్థాన్ ముఖ్యమంత్రిపై ఇటువంటి అవమానకరమైన పదజాలం ఉపయోగించినందుకు ఆయనపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.