బాబా కా ధాబా: యూట్యూబర్ గౌరవ్ వాసన్‌‌పై కేసు

బాబా కా ధాబా: యూట్యూబర్ గౌరవ్ వాసన్‌‌పై కేసు

న్యూఢిల్లీ: బాబా కా ధాబా ఓనర్ కంతా ప్రసాద్‌‌కు వచ్చిన డొనేషన్స్‌‌ను తప్పుదారిలో మళ్లించినందుకు యూట్యూబర్ గౌరవ్ వాసన్ మీద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌‌డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వాళ్లలో కంతా ప్రసాద్ (80) దంపతులు కూడా ఉన్నారు. లాక్‌‌డౌన్ టైమ్‌‌లో ధాబాకు కస్టమర్స్ రాకపోవడంతో వీరికి పూట గడవడం కష్టమైంది.

గౌరవ్ వాసవ్ అనే యూట్యూబర్ ప్రసాద్ దంపతులు పడుతున్న బాధపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక్క పోస్ట్‌‌తో బాబా కా ధాబాలో తినడానికి చాలా మంది ప్రజలు క్యూ కట్టారు. కొందరు సెలబ్రిటీలు కూడా కంతా ప్రసాద్‌‌కు చేయూతను అందించారు. అయితే బాబా కా ధాబా వృద్ధులకు సాయం చేయాలంటే ఫలానా బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ నంబర్లకే డబ్బులు పంపాలని గౌరవ్ వాసన్ యత్నించాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు గౌరవ్ తమను మోసం చేశాడంటూ అక్టోబర్ 31న కంతా ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు.. సెక్షన్ 420 ప్రకారం వాసన్‌‌పై కేసు నమోదు చేశారు.