అగ్నిప్రమాదంలో బాలుడు సజీవ దహనం

అగ్నిప్రమాదంలో బాలుడు సజీవ దహనం
  • మేడ్చల్​ జిల్లా​జవహర్ నగర్ లో ఘటన 

జవహర్ నగర్ వెలుగు: ఏడేండ్ల బాలుడు కరెంట్​ షాక్​తో సజీవ దహనమయ్యాడు. మేడ్చల్  జిల్లా జవహర్ నగర్  పరిధిలోని ప్రగతి నగర్​కు చెందిన అనురాజ్ (7) కాలిపోయాడు. స్ప్రింగ్  బెడ్​పై పడుకున్న అనురాజన్​పై విద్యుత్ వైర్ తెగి పడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.