
సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. క్లాక్ టవర్ పక్కన ఉన్న నవకేతన్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. షాట్ సర్క్యూట్ తో కాంప్లెక్స్ లో మంటల చెలరేగినట్లు తెలుస్తోంది. భవనం సెల్యూలార్ నుంచి పొగ, మంటలు ఎగిసిపడ్డాయి. సెల్యూలార్ లో జరిగిన ప్రమాదంతో ఏడో అంతస్తులో ఉన్న కేబుల్ వైర్లు కూడా కాలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలార్పారు. భవనంలో బ్యాంకు, వ్యాపార సంస్థలు ఉండటంతో ఆందోళన చెందుతున్నారు వ్యాపారులు.కేబుల్స్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని ADFO ధనుంజయ్ రెడ్డి తెలిపారు.