తిరుమల ఏడు కొండల్లో మంటలు.. తగలబడుతున్న ఎర్ర చందనం చెట్లు

తిరుమల ఏడు కొండల్లో మంటలు.. తగలబడుతున్న ఎర్ర చందనం చెట్లు

కలియుగ వైకుంఠం తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీ గంధం వనంలో చెట్లు దగ్ధమవ్వటంతో  తిరుమలలో దట్టంగా పొగ అలుముకుంది. పార్వేట మండపం ప్రాంతంలో మంటలు ఎగసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగటంతో వన్యప్రాణులు బయటకు వచ్చే అవకాశం ఉందని నడకదారిన దర్శనానికి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అన్నారు.

అగ్ని ప్రమాదానికి కారణం తీవ్రమైన ఎండలే అని అధికారులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం పట్ల సిబ్బందిని అప్రమత్తం చేసిన అధికారులు ఎటువంటి ఆస్థి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పలు ప్రాంతాల్లో దేశంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.