
హైదరాబాద్ : అబిడ్స్‌లోని ఓ భవనంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. అయితే.. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనం కిందున్న జనాలు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో ఎంత మేరకు ఆస్తి, జన నష్టం వాటిల్లింది.. అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.