అనంతపురం సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

అనంతపురం సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

అనంతపురం జిల్లా బోయరెడ్డిపల్లి సమీపంలోని పెన్నా సిమెంట్  ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలో బొగ్గును వేడి చేసే బాయిలర్  దగ్గర ఉష్ణోగ్రత ఎక్కువై ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందంటూ ఆందోళనకు దిగారు బాధిత కుటుంబ సభ్యులు. తాడిపత్రి DSP శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సమస్య సద్దుమణిగేలా చేశారు.