
హైదరాబాద్లో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక సులేమాన్ నగర్ ఎం ఎం పహాడీలో ఉన్న -ఓ కట్టెల గోడౌన్ లో డిసెంబర్ 27 తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనికి తోడు పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణంలో కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
సంఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు స్థానికులను మరోచోటుకు తరలిస్తున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో భారీగానే ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తు్ంది. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.