బ్రిటానియా బిస్కెట్ కంపెనీ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం

బ్రిటానియా బిస్కెట్ కంపెనీ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం

కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఓ బిస్కెట్స్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొనతనపాడు పరిధిలోని బ్రిటానియా బిస్కెట్స్ కంపెనీ లో శనివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  కర్ణాటక, మహారాష్ట్ర లలో తయారయ్యే బిస్కట్లు, ఈ గోడౌన్ లో నిల్వ చేసి, ఇక్కడ నుండి ఇతర ప్రాంతాలకు డెలివరీ ఇస్తారు

ఉదయం 2.30 గంటల సమయంలో గోడౌన్ కు  బిస్కెట్స్ లోడ్ తో వచ్చిన  లారీ డ్రైవర్.. వైర్లు కాలుతున్న వాసన వస్తోందని  వాచ్ మెన్ కు తెలిపాడు.  దీంతో వాచ్ మెన్ వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమందించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది.

గోడౌన్ నిర్మాణ ఖర్చు 2రూ 3 కోట్లు కాగా…  అందులో బిస్కెట్స్ ఖర్చు రూ. 2-3కోట్ల మేరకు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.  సంఘట నా స్థలానికి చేరుకున్న జిల్లా ఫైర్అసిస్టెంట్ ఆఫీసర్ శేఖర్, కంకిపాడు ఎస్సై శాతకర్ణి వివరాలు సేకరిస్తున్నారు. రాత్రి 7.30 గంటల వరకు గోడౌన్ లో పలు వెల్డింగ్ పనులు జరిగాయని గోడౌన్ లోని సిబ్బంది తెలిపారు.