మలక్‌పేట బైక్‌షోరూంలో ప్రమాదం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మలక్ పేట పరిధిలోని ఆది హోండా షోరూంలో శనివారం మంటలు అంటుకుని 50 బైకులు కాలిపో యాయి. ఉదయం 5 గంటలకు షోరూం ఫస్టు, సెకండ్ ఫ్లోర్లలో మంటలను గమనించిన వాచ్మెన్ పోలీసులకు, షోరూం మేనేజర్‌కు సమాచారమివ్వడంతో వాళ్లు ఫైర్ సిబ్బందిని అలర్ట్ చేశారు. స్పాట్‌కు చేరుకున్న సిబ్బంది.. 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని, భారీ ఆస్తి నష్టం జరిగిందని ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో బైకులతో పాటు కంప్యూటర్లు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యిందన్నారు.

