చర్లపల్లి: కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం 

చర్లపల్లి: కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం 

హైదరాబాద్  చర్లపల్లి  ఇండస్ట్రియల్  ఏరియాలోని  కెమికల్  కంపెనీలో  భారీ  అగ్నిప్రమాదం  జరిగింది. ఆర్గానిక్  ఫెర్టిలైజర్  కెమికల్  కంపెనీలో తెల్లవారుజామున  మంటలు  అంటుకున్నాయి. దీంతో  కార్మికులు  బయటకు  పరుగులు  తీశారు. దట్టమైన పొగతో  మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల  ప్రజలు  భయాందోళన  చెందుతున్నారు.  సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది  సంఘటనా స్థలానికి  చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి.  దీంతో పాటు 25 ట్యాంకర్లను  తెప్పించి  మంటలను ఆర్పేందుకు  ప్రయత్నిస్తున్నారు.  లక్షల రూపాయలకు  పైగా ఆస్తి నష్టం  జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు  5 గంటలకు పైగా  మంటలు ఎగిసిపడుతున్నట్టు స్థానికులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియల్సి ఉంది.