
ఢిల్లీ సిటీ బస్సులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దట్టంగా పొగ అలుముకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 8 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు దాదాపు గంట సమయం పట్టింది. బస్సుకు సమీపంలోని రెండు షాపుల్లోను మంటలు చెలరేగడంతో వాటిని కూడా ఆర్పేశారు. బస్సులో అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు.
Crazy fire in a DTC bus today. Reports @mukeshmukeshs pic.twitter.com/I6sz7E4F0j
— Sanket Upadhyay (@sanket) April 6, 2022