
రంగారెడ్డి జిల్లా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం జరిగింది. మంటలు అంటుకొని మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను హాస్పిటల్ కు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పివేశారు.