హైదరాబాద్ MGBSలో అగ్నిప్రమాదం... గద్వాల డిపో బస్సులో మంటలు...

హైదరాబాద్ MGBSలో అగ్నిప్రమాదం... గద్వాల డిపో బస్సులో మంటలు...

హైదరాబాద్ MGBS లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. మంగళవారం ( మే 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఎంజీబీఎస్ బస్టాండ్ లో బస్సులో మంటలు చెలరేగాయి. ప్లాట్ ఫామ్ దగ్గర పార్క్ చేసిన గద్వాల డిపో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు.

ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బస్సు మెయింటెనెన్స్ లోపమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు అధికారులు. బస్సు ప్లాట్ ఫామ్ పై నిలిపి ఉన్న సమయంలో ఘటన జరగడంతో బస్సులో ప్రయాణికులు ఎవరు లేరు కాబట్టి పెను ప్రమాదమే తప్పింది. 

ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఎండలు విపరీతంగా ఉన్న క్రమంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని.. వాహనాల్లో ఎండ వేడికి వాహనాల్లో మంటలు వచ్చే ఆ ప్రమాదం ఉందని అంటున్నారు అధికారులు.