హైదరాబాద్ టోలి చౌకిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ టోలి చౌకిలో అగ్ని ప్రమాదం

రోజు రోజుకు అగ్నిప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. మొన్న ముంబాయి, నిన్న ఢిల్లీ, నేడు హైదరాబాద్. హైదరాబాద్ టోలి చౌకిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముస్కాన్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కాంప్లెక్స్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదం వల్ల షాపులలోని బట్టలు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు పక్కనున్న షాపులకు కూడా విస్తరిస్తున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.