ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట్ ఏరియాలో ఓ ప్లాస్టిక్ గోదాం మంటలు చెలరేగాయి. షాక్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి.. కాసేపటికే దట్టమైన పోగతో మంటలు ఎగిసిపడ్డాయి.

రోజూ లానే కూలీలు సోమవారం ఉదయం గోదాం తెరిచి పనులు చేస్తున్నారు. అందులో పనిచేసే లేబర్ ఉదయం 9గంటలకు మిషన్ ఆన్ చేసి పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు విస్తరించి దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అక్కడ పనిచేసే సిబ్బంది బాలాపూర్ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.  రెండు ఫైర్ ఇంజన్ తో మంటలు అర్పారు. ప్లాస్టిక్ గోదాం యజమాని హజీబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.