
పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)పాత ప్లాంట్ స్విచ్ యార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఫ్యాక్టరీలో ఆర్టిజన్లుగా పనిచేస్తున్న జూలకంటి కార్తీక్ , వెంకన్న స్విచ్ యార్డ్లో డ్యూటీ చేస్తుండగా ట్రాన్స్ ఫార్మర్ వద్ద మంటలు వ్యాపించాయి. దీంతో కార్తీక్కు మంటలంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హైదరాబాద్ తరలించారు. వెంకన్న స్వల్పంగా గాయపడ్డాడు.