
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక బుచ్చినెల్లి గ్రామంలోని ఓ కంపెనీలో అర్ధరాత్రి సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు స్పాట్ లోనే చనిపోగా… మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తిని ప్రదీప్ గా గుర్తించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ కు తరలించారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది…మంటలను అదుపులోకి తెచ్చారు.