ముషీరాబాద్: మారుతి షోరూంలో అగ్నిప్రమాదం

ముషీరాబాద్: మారుతి షోరూంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ లో  అగ్నిప్రమాదం  జరిగింది. ముషీరాబాద్ లోని  మారుతి షోరూంలో శుక్రవారం అర్ధరాత్రి  మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 7 కార్లు కాలిపోయాయి.  స్థానికుల సమాచారంలో  ప్రమాద స్థలానికి  చేరుకున్న ఫైర్ సిబ్బంది,  4 ఫైర్  ఇంజన్లతో  మంటలను  అదుపులోకి తెచ్చారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.