
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 15 మూగ జీవాలు గాయపడ్డాయి. కుర్నపల్లి గ్రామానికి చెందిన అబ్బయ్య అనే రైతు పశువుల కొట్టంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. గాయపడిన పశువులకు ట్రీట్మెంట్ చేస్తున్నారు వెటర్నరీ సిబ్బంది. ప్రమాద స్థలాన్ని ఎడపల్లి తహశీల్దార్, అధికారులు పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ తో వ్యవసాయ పరికరాలు, టూవీలర్ కాలిపోయిందని రైతు చెప్తున్నాడు. ఘటనకు సంబంధించిన నివేదికలను జిల్లా కలెక్టర్ కు వివరిస్తామన్నారు తహశీల్దార్.