సినిమా థియేటర్ లో అగ్ని ప్రమాదం

సినిమా థియేటర్ లో అగ్ని ప్రమాదం

తూర్పుగోదావరి:  జిల్లాలోని మలికిపురం పద్మజ థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. థియేటర్‌లో మజిలీ సినిమా మ్యాట్నీ షో మొదలయ్యే  ముందు ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో థియేటర్ ఖాళీగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మూవీ చూసేందుకు థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు భయాందోళకు గురయ్యారు.

ఈ ఘటనతో థియేటర్‌లోని ఫర్నీచర్‌ అగ్నికి అహుతి అవ్వగా.. పై కప్పు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్‌ సర్క్యట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.