రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చందుర్తి శివారులోని పంట పొలాల దగ్గర ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. భారీ గాలులకు మంటలు కిలోమీటర్ల మేర వ్యాపించాయి. అయితే మంటలు చెలరేగడంతో పొలాల వద్ద ఉన్న గడ్డివాములు, వ్యవసాయ కొట్టాలు, వ్యవసాయ సామాగ్రి తో పాటు పొలాల వద్ద ఉన్న వివిధ రకాల చెట్లు పూర్తిగా కాలి బూడిద అయిపోయాయి. మంటలను ఆర్పేందుకు రైతులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ అప్పటికే పూర్తిగా కాలిపోయాయి. సకాలంలో స్పందించాల్సిన ఫైర్ స్టేషన్ సిబ్బంది స్పందించలేదని అన్నారు రైతులు.