
హైదరాబాద్ గన్‌ఫౌండ్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గన్‌ఫౌండ్రిలోని ఓ చెప్పుల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. మొదట ఓ హోటల్ కిచెన్‌లో చెలరేగిన మంటలు భారీగా ఎగసిపడటంతో గోడౌన్‌వైపు వ్యాపించాయి. గోడౌన్‌లోని చెప్పులు, హోటల్‌లోని ఫర్నిచర్ అగ్నికి ఆహుతైయ్యాయి. సమచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండు ఫైరింజన్లు మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.