
తిరుమల : శేషచల కొండల్లో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీవారి పాదాలకు సమీపంలో ఉన్న అటవీప్రాంతంలో అగ్నికీలకలు ఎగసి పడుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫైర్ ఇంజన్ వెళ్లే అవకాశం లేకపోవడంతో.. అటవీశాఖ సిబ్బంది మంటులను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. చెట్ల కొమ్ములతో ఎగసి పడుతున్న మంటలను అర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదాల నియంత్రణకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతోనే తరచు ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు TTD ఫారెస్ట్ సిబ్బందితో పాటు భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.