రాజేంద్రనగర్, బాలానగర్ లో భారీ అగ్ని ప్రమాదాలు

రాజేంద్రనగర్, బాలానగర్ లో భారీ అగ్ని ప్రమాదాలు

హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు జనాన్ని భయపెడుతున్నాయి. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ సాయిబాబానగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇండ్ల మధ్యన ఉన్న ఓ ప్లాస్టిక్ కంపెనీలో ప్రమాదంతో.. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో.. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. గంటపాటు శ్రమించి మంటలను ఆర్పేశారు అగ్నిమాపక సిబ్బంది.

బాలానగర్ పారిశ్రామిక వాడలో మరో అగ్నిప్రమాదం జరిగింది. ఓ గోడౌన్ లో మంటలు అంటుకుని.. లోపల ఉన్న సామాగ్రి మొత్తం కాలిబూడిద అయింది. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ తోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు అనుమానిస్తున్నారు.