
హైదరాబాద్: గోషామహల్ పీఎస్ పరిధిలో ఓ జ్యూవెలర్స్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. పండుగ కావడంతో నిర్వాహకులు షాప్ క్లోజ్ చేశారు. మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.