షాద్‌నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న ట్రెండ్స్ షాపింగ్ మాల్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. షాపు సెల్లార్‌లోని జనరేటర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో జనరేటర్‌తో పాటు సెల్లార్‌లో నిల్వ ఉంచిన స్టాక్ అగ్నికి ఆహుతైంది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
సదరన్ రెస్టారెంట్‌లో..
జూబ్లీహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో ఉన్న సదరన్ రెస్టారెంట్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. కిచెన్‌లో వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, రెస్టారెంట్ స్టాఫ్, స్థానికులు మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.
