ఐకేపీ సెంటర్ లో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ధాన్యం.. రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా

ఐకేపీ సెంటర్ లో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ధాన్యం.. రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా

ఐకేపీ సెంటర్ లో అగ్ని ప్రమాదం..చూస్తుండగా మంటలు వ్యాపించాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అగ్గి పాలయ్యింది. అది చూసి రైతన్న బోరు విలపించాడు. ధాన్యం కొనుగోలు సెంటర్లకు తరలించి రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడం, మిల్లులకు తరలించకపోవడంతో పంట అగ్ని,  అకాల వర్షం పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా తిప్పన్నపేటలో శనివారం (మే23) జరిగింది. వివరాల్లోకి వెళితే.. 

జగిత్యాల జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. తిప్పన్నపేటలో ఐకేపీ కొనుగోలు కేంద్రం పక్కనే పంట పొలాల్లో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. చూస్తుండగానే మంటలు సమీప ఐకేపీ కేంద్రంలోని ధాన్యం కుప్పలకు వ్యాపించాయి. దీంతో పలువురు రైతులకు చెందిన ధాన్యం కాలి బూడిదయ్యింది. అయితే ప్రమాదంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ధాన్యం ఐకేపీ సెంటర్లకు తరలించి చాలా రోజులు అవుతున్నా కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.

►ALSO READ | సూర్యపేటలో భగ్గుమన్న పాతకక్షలు..బీఆర్ఎస్ నేతను 3 ముక్కలుగా నరికి గోణె సంచిలో వేసి.!