సూర్యపేటలో భగ్గుమన్న పాతకక్షలు..బీఆర్ఎస్ నేతను 3 ముక్కలుగా నరికి గోణె సంచిలో వేసి.!

సూర్యపేటలో భగ్గుమన్న పాతకక్షలు..బీఆర్ఎస్ నేతను 3 ముక్కలుగా నరికి గోణె సంచిలో వేసి.!

సూర్యపేట జిల్లాలో ఘోరం జరిగింది.మే 22న అర్థరాత్రి యార్కారంలో ఒక్కసారిగా పాతకక్షలు భగ్గుమన్నాయి. దుండగులు అత్యంత దారుణంగా నడిరోడ్డుపై ఒకరిని కత్తులు, కొడవళ్లతో మూడు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

హత్యకు గురైన వ్యక్తిని బీఆర్ఎస్ నేత మధుగా గుర్తించారు. నిందితులు మధును కిరాతకంగా నరికి చంపడమే కాకుండా... ఆ పాడుబడ్డ శవాన్ని ఒక గోణె సంచిలో చుట్టి ఊరవతల పడేశారు. ఉదయం ఈ దారుణాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, మృతి చెందిన మధుపై గతంలో రెండు హత్య కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. పాతకక్షల నేపథ్యంలోనే ఈ దారుణ హత్య జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సూర్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ హత్య ఉదంతంతో యార్కారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.