మెహదీపట్నం బస్టాండులో..ఆర్టీసి బస్సులో మంటలు..భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు

మెహదీపట్నం బస్టాండులో..ఆర్టీసి బస్సులో మంటలు..భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు

హైదరాబాద్: మెహదీపట్నంలో ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది.. మంగళవారం(ఆగస్టు26) ఉదయం మెహదీపట్నం బస్టాండులో నిల్చున్న సిటీ ఆర్డినరీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  భారీ ఎత్తున మంటలు  ఎగిసిపడటంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. 

బస్సు స్టార్ట్ కాకపోవడంతో డ్రైవర్ మరమ్మతులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయని తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో  పెద్ద ప్రమాదం తప్పింది.